ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ఇడుపులపాయ ఐఐఐటీ ఆర్కే వ్యాలీలో ఈ3, ఈ4 విభాగాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టారు. పోలీసులు, అధికారులు.. నచ్చజెప్పినా విద్యార్థులు శాంతించకపోవడంతో వాళ్లను వేరువేరు గదుల్లో ఉంచారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. పలువురుకి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఇడుపులపాయ ఐఐఐటీలో కర్రలతో దాడి చేసుకున్న విద్యార్థులు - iiit idupulapaya
ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ఐఐఐటీ ఆర్కే వ్యాలీలోని విద్యార్థులు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను చెదరగొట్టారు. ఓ అమ్మాయితో.. ఓ విద్యార్థి అసభ్యకరంగా మాట్లాడాడనే కారణంగా మూడు రోజుల క్రితం వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.
కర్రలతో దాడి చేసుకున్న విద్యార్థులు
ఆర్కే వ్యాలీలోని ఈ3 విద్యార్థి ఈ4కు చెందిన ఓ అమ్మాయితో తప్పుగా మాట్లాడాడని.. దీంతో ఆమె ఈ4లోని తన స్నేహితునికి చెప్పడంతో మూడు రోజుల క్రితం మొదలైన వివాదం ఇవాళ గొడవకు దారితీసిందని తెలుస్తోంది. అయితే ఐఐఐటీ అధికారుల ముందే గొడవ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి:'సాగర్ పోరు': హోరెత్తిన ప్రచారం.. మండుటెండలోనూ ప్రజల్లోకి వెళుతున్న అభ్యర్థులు