CJI NV RAMANA TOUR: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. నాలుగు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 24 నుంచి 27వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామం పొన్నవరానికి రానున్నారు. దీంతో పొన్నవరంలో సందడి నెలకొంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీజేఐ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..
24వ తేదీన..
ఈనెల 24న ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా పొన్నవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పొన్నవరంలో భోజనం చేయనున్నారు. అనంతరం పొన్నవరం నుంచి విజయవాడ నోవాటెల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30కు నోవాటెల్ నుంచి గుంటూరుకు చేరుకుంటారు. అనంతరం గుంటూరు నుంచి చందోలు గ్రామం, ఆ తరువాత పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి కలవనున్నారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు విజయవాడ నోవాటెల్‌కు తిరిగి రానున్నారు.
25వ తేదీన..
25న ఉదయం 8.30 నుంచి 9.30 వరకు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం నోవాటెల్‌కు చేరుకొని విజిటర్లతో మాట్లాడతారు. సాయంత్రం 4.45కు ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రభుత్వం ఇచ్చే హైటీలో పాల్గొంటారు. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు సిద్ధార్ద అకాడమీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హైకోర్టు సీజే ఆధ్వరంలో ఇచ్చే విందు కార్యక్రమంలో పాల్గొంటారు.