CJI justice NV Ramana news: నేడు తిరుమలకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ - cji nv ramana in tirumala
09:31 October 14
CJI justice NV Ramana news: నేడు తిరుమలకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ(CJI justice NV Ramana) దర్శించుకోనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(tirumala brahmotsavam 2021) ఆయన పాల్గొననున్నారు. మ.1.30 గం.కు రేణిగుంట చేరుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ.. ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్తారు.
ఇవాళ రాత్రి శ్రీవారికి జరిగే అశ్వ వాహనసేవలో జస్టిస్ ఎన్.వి.రమణ(CJI justice NV Ramana) పాల్గొననున్నారు. రాత్రికి పద్మావతి అతిథిగృహాంలో బసచేసి.. రేపు జరిగే చక్రస్నాన సేవలో పాల్గొంటారు.
ఇవీ చూడండి: tirumala news : శ్రీవారికి రోజూ ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా..!