తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ దంపతులు - శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

CJI Justice NV Ramana: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ దంపతులు
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ దంపతులు

By

Published : Mar 14, 2022, 5:58 AM IST

CJI Justice NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ దంపతులు ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో ఎస్. లవన్న, అర్చకులు, వేదపండితులు పూలమాలలతో సాదర స్వాగతం పలికారు.

జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మహా మంగళహారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జస్టిస్​ ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details