CJI JUSTICE NV RAMANA: 'కృష్ణా నదీ జలాల పిటిషన్‌పై నేను విచారణ చేపట్టను' - CJI JUSTICE NV RAMANA transferred the AP petition
11:24 August 04
కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ
కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను.... సుప్రీంకోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.... సోమవారం జరిగిన విచారణలో ఇరు రాష్ట్రాలకు సూచించారు. ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తెలపాలని ఆదేశించారు. అయితే... న్యాయపరంగానే పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ తెలిపింది.
ఈ నేపథ్యంలో పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ.... సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరగా.... జస్టిస్ ఎన్వీ రమణ నిరాకరించారు. ఈ పిటిషన్‌పై తాను విచారణ చేపట్టబోనని స్పష్టం చేశారు.