తెలంగాణ

telangana

ETV Bharat / city

రిటైర్ అయిన తర్వాత ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తా: జస్టిస్ ఎన్వీ రమణ

Justice NV Ramana: ఎన్టీఆర్ మనిషిగా ఉండటాన్ని తాను గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 1983 నుంచి ఎన్టీఆర్.. మనిషిగా తనపై ముద్ర వేశారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని చెప్పారు.

Justice NV Ramana
జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Jun 9, 2022, 7:52 PM IST

Justice NV Ramana: ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జనం నాడి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఏపీలోని తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాలన్న అంశంపై సందిగ్దత ఉంటుందని.. ఎన్నో సదస్సుల్లో పాల్గొన్నా... ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురుకాలేదని అన్నారు. ఎన్టీఆర్ స్వలాభం కోసం కాకుండా.. ప్రజా సేవకోసం పార్టీ పెట్టారని చెప్పారు. పార్టీ ప్రారంభించి నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని తెలిపారు. 1984 ఎన్నికల్లో పార్లమెంట్​లో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అన్యాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌తో కొంత సాన్నిహిత్యం ఉందని.. 1983 నుంచి ఎన్టీఆర్.. మనిషిగా తనపై ముద్ర వేశారని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మనిషిగా ఉండటాన్ని తాను గర్విస్తున్నానని చెప్పారు. రాజకీయ పార్టీకి సిద్ధాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్​ అని ప్రశంసించారు. పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్‌పై ఓ పుస్తకం రాస్తానని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్​కు గుర్తింపు కోసం అందరూ పోరాడాలని సూచించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details