AP High court Additional Building : ఏపీ హైకోర్టు అదనపు భవనానికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఉదయం 9.50 నిమిషాలకు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్ అసోయేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
AP High court Additional Building : ఏపీ హైకోర్టు అదనపు భవనానికి సీజే శంకుస్థాపన - AP high court new building
AP High court Additional Building : ఏపీ హైకోర్టు అదనపు భవనానికి పునాది పడింది. ఇవాళ ఉదయం 9.50 నిమిషాలకు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేతుల మీదుగా శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు
ప్రస్తుతం ఉన్న భవనం పూర్తి స్థాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా అదనపు భవనం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అదనపు భవనాన్ని జీ+5 సామర్ధ్యంతో నిర్మించనున్నారు. నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాలను ఉన్నతాధికారులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు వివరించారు.
- ఇదీ చదవండి :10 నెలల జైలు జీవితం గడిపి.. స్వదేశానికి రైతులు