తెలంగాణ

telangana

ETV Bharat / city

ధాన్యం మిల్లింగ్‌ వేగవంతం చేయాలి: గంగుల - మంత్రి గంగుల కమలాకర్ వార్తలు

రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ వేగవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో యాసంగి ధాన్యం మిల్లింగ్‌పై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.

gangula kamalakar
గంగుల

By

Published : Aug 29, 2021, 4:04 AM IST

హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో యాసంగి ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2020-21 రబీ పంట కాలం మిల్లింగ్, 25 శాతం బియ్యం భారత ఆహార సంస్థకు అందజేయడం, మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం, గత ఏడాది వానా కాలంలో ఎఫ్‌సీఐకు అందజేయాల్సిన 2.96 లక్షల మెట్రిక్ టన్నులు అంశం, రాబోయే వానా కాలం కొనుగోళ్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధాన్యం మిల్లింగ్ వివరాలు కమిషనర్ మంత్రికి తెలియజేశారు. గత యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యం మొత్తం మిల్లులకు చేర్చిన పౌరసరఫరాల శాఖ... ఇప్పటికే ఎఫ్‌సీఐకు 25 శాతం బియ్యం అందజేసింది. ప్రస్తుతం రోజుకు 21 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ సామర్థ్యం అవుతున్న దృష్ట్యా... ఇక నుంచి మరింత వేగవంతంగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అందించేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది వానా కాలం మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, గన్నీ సంచులు సేకరించి కేంద్రాల్లో అందుబాటులో పెట్టడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్రమైన ప్రణాళికలతో ఒక నివేదిక అందజేచాలని మంత్రి గంగుల ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:Vaccination: ప్రత్యేక వ్యాక్సిన్​ డ్రైవ్​కు​ స్పందన కరవు.. వందశాతం అయ్యేదెప్పుడు..?

ABOUT THE AUTHOR

...view details