స్వచ్ఛ హైదరాబాద్‌కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... దత్తాత్రేయకు పౌర సన్మానం నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించినట్టేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ - ఎల్బీనగర్ చిత్ర లేఅవుట్లో బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం
తగు జాగ్రత్తలు తీసుకొని కరోనాను జయించవచ్చని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎల్బీ నగర్ పరిధిలోని చిత్ర లే అవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు పౌర సన్మానం నిర్వహించారు.
![విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ civic felicitation to himachalapradesh governor bandaru dathathreya in lb nagar chithra layout](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10053366-thumbnail-3x2-datha.jpg)
విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్: దత్తాత్రేయ
కరోనా వ్యాక్సని తీసుకురావడంలో భాతర్ బయోటెక్, సీరంలు ముందున్నాయని పేర్కొన్నారు. త్వరలో అందరికీ విడతల వారీగా టీకాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లు... మహిళా సాధికారతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు, కార్పొరేటర్లు, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పౌరులందరికీ ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాం: ధర్మేంద్ర ప్రధాన్