ఆర్టీసీ ఐకాసతో సీఎం కేసీఆర్ చర్చలు జరపాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటేష్ డిమాండ్ చేశారు. భేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ సుందరయ్య పార్కు వద్ద సీఐటీయూ ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సమ్మెకు సంఘీభావంగా సుందరయ్య పార్కు వద్ద సీఐటీయూ ధర్నా - సమ్మెకు సీఐటీయూ సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ సుందరయ్య పార్కు వద్ద సీఐటీయూ ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన తెలిపింది. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేవరకు దశలవారీగా పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ ప్రకటించింది.
citu support tsrtc strike