తెలంగాణ

telangana

ETV Bharat / city

‘6 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే తెగిన అవయవాలను అతికించొచ్చు’

వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చేలా ప్రయత్నిస్తే ప్రమాదాల్లో తెగి పడిన అవయవాలు అతికించడానికి ఆస్కారం ఉంటుందని హైదరాబాద్ నల్లగండ్ల సిటిజన్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యంత్రంలో పడి తెగిపోయిన ఓ కార్మికుడి మణికట్టుని ఆసుపత్రి ఆర్థొపెడిక్‌ టీమ్‌ వైద్యులు తిరిగి విజయవంతంగా అతికించారు.

Nallagandla Citizen Hospital
Nallagandla Citizen Hospital

By

Published : Jun 1, 2022, 9:45 AM IST

ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు తెగిన వెంటనే... ఆరుగంటల వ్యవధి లోపు రోగిని అవయవాలను ఆసుపత్రికి చేర్చేలా ప్రయత్నిస్తే వాటిని రక్షించడానికి అవకాశాలు ఉంటాయని హైదరాబాద్​ నల్లగండ్ల సిటిజన్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యంత్రంలో పడి తెగిపోయిన కార్మికుడి మణికట్టుని తిరిగి అతికించిన ఆసుపత్రి ఆర్థొపెడిక్‌ టీమ్‌ వైద్యులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.

మణికట్టు అతికించిన రోగితో వైద్య బృందం

‘‘సంగారెడ్డి జిల్లా నందిగ్రామ్‌ ప్రాంతం పానియాల పరిశ్రమలో పని చేస్తున్న హరీష్‌ (22) చేయి యంత్రంలో పడి మణికట్టు వరకు తెగిపడింది. ఈ క్రమంలో మణికట్టుని ఓ ప్లాస్టిక్‌ కవర్లో వేసి దాన్ని ఐస్‌లో పెట్టి తీసుకొచ్చారు. అనేక గంటలు శ్రమించిన వైద్యులు మణికట్టుని తిరిగి అతికించారు. కొన్ని నెలల్లో తిరిగి చేయి మామూలు స్థితికి వస్తుంది. చేతులు, వేళ్లు, కాళ్లు తెగిపడ్డప్పుడు వెంటనే అవయవాన్ని ప్లాస్టిక్‌ కవర్​లో ఉంచి ఐస్‌లో పెట్టుకొని తీసుకురావాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు తాగునీళ్లు ఇవ్వడం వంటి చర్యలు చేయవద్దు. ముందు అంబులెన్సు వచ్చే విధంగా చేయాలి. ఆరుగంటల వ్యవధి లోపు రోగిని అవయవాలను చేర్చితే వాటిని రక్షించడానికి అవకాశాలు ఉంటాయి’’ అని వివరించారు. కార్యక్రమంలో వైద్యులు అశోక్‌ రాజు, వాసుదేవ జువ్వాడి, కిలారు ప్రఫుల్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌లు వెంకటేష్‌ బాబు, శశిధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి :పారిశుద్ధ్య పనుల్లో రాజకీయ కన్ను... టెండర్లు దక్కేలా అధికారులపై ఒత్తిడి

ABOUT THE AUTHOR

...view details