ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ(Nagarjuna meet AP CM YS Jagan Mohan Reddy) అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున(Nagarjuna meet AP CM YS Jagan Mohan Reddy) మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
- పవన్ వ్యాఖ్యల దుమారం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. స్వయంగా చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వాళ్లు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇంతకీ పవన్ ఏమన్నారంటే...'సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే.. వైకాపా నేతలు కాలిపోతారు.. జాగ్రత్త' అని రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. 'ఇది వైకాపా రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్..' అని వ్యాఖ్యానించారు. వైకాపా రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హితవు పలికారు. గూండాలకు భయపడితే బతకడం అసాధ్యమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైకాపా ప్రభుత్వం తీరు మారాలన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని మార్చేందుకు ఏం చేయాలో తమకు తెలుసన్న పవన్... 'తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు.. ఆపలేరు' అని స్పష్టం చేశారు.
- గతంలోనూ చిరు సమక్షంలో భేటీ...