ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణ నేడు తుళ్లూరులో కొనసాగింది. రాజధాని ప్రాంతానికి చెందిన రాయపూడి, ఉద్దండరాయుని పాలెం రైతులను.. సీఐడీ అధికారులు స్థానిక పోలీస్స్టేషన్లో ప్రశ్నించారు.
తుళ్లూరులో రైతులను ప్రశ్నించిన సీఐడీ అధికారులు - తుళ్లూరు రైతులను విచారించిన సీఐడీ
ఏపీలోని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై.. తుళ్లూరు మండలంలోని రైతులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతానికి చెందిన రాయపూడి, ఉద్దండరాయునిపాలెం కర్షకుల వద్ద వివరాలుసేకరించారు.
తుళ్లూరులో సీఐడీ అధికారులు, అమరావతి అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ
ఇప్పటికే రైతుల వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో.. రాజధానికి చెందిన మిగతా ప్రాంతాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి:'అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు వ్యాక్సినేషన్లో భాగస్వామ్యం కావాలి'