CID Officers Arrest Five Persons in ap: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ తన దూకుడును పెంచింది. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అరెస్టు చేసింది. ఏపీ రాజధాని ప్రాంతంలో 1100 ఎకరాల మేర అసైన్డ్ భూములలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. రాజధానిలోని వేర్వేరు గ్రామాల్లో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపించింది.
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు అరెస్ట్.. - ఏపీ తాజా వార్తలు
Amaravati Assigned Lands Case in ap: ఏపీలోని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొన్నారని సీఐడీ అభియోగాలు మోపింది.
సీఐడీ
వేర్వేరు సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్తుల పేరుతో కొనుగోలు చేసినట్లు అభియోగం మోపారు. వీరందరిపైనా మంగళగిరిలోని సీఐడీ స్టేషన్లో ఐపీసీలోని వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1) కింద అభియోగాలు మోపినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబు అనే ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: