తెలంగాణ

telangana

ETV Bharat / city

CID CASE ON ABN MD Radhakrishna : ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై సీఐడీ కేసు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ABN MD Radhakrishna : ఆంధ్రజ్యోతి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియో గ్రాఫర్‌, రిపోర్టర్‌లను నిందితులుగా పేర్కొన్నారు.

CID
CID

By

Published : Dec 13, 2021, 9:44 AM IST

ABN MD Radhakrishna : ఆంధ్రజ్యోతి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరుపుతుండగా రాధాకృష్ణతో పాటు మరికొందరు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ... సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియో గ్రాఫర్‌, రిపోర్టర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ జీరో ఎఫ్ఐఆర్​ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని, తదుపరి విచారణకు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ ఎస్​హెచ్​ఓకు ఈ కేసును బదలాయించేందుకు వీలుగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని ఎఫ్ఐఆర్ లో వివరించారు.

ఇదీచదవండి:Triple murder in dichpally: 19 ఏళ్లకే మూడు హత్యలు.. అందుకోసమే ఘాతుకం

ABOUT THE AUTHOR

...view details