Christmas celebrations in telangana: రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్ ఉత్సవాల కమిటీతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి భేటీ అయ్యారు. పంపిణీకి ప్రభుత్వం సిద్ధం చేసిన దుస్తులను మంత్రులు విడుదల చేశారు.
క్రిస్మస్ వేడుకలకు సీఎం..
clothes distribution for Christmas: సుమారు 2.5 లక్షల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నెల 17 వరకు రాష్ట్రంలోని 95 అసెంబ్లీ స్థానాల్లో దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 21 లేదా 22న ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేడుకలు నిర్వహిస్తామన్న మంత్రి.. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. నగరంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణ కోసం.. జీహెచ్ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈనెల 15న భేటీ అనుకున్నట్టు కొప్పుల తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.