నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ప్రైవేట్ వ్యాపారి ఏడుకొండలు నుంచి దృష్టి మరల్చి 55 వేల రూపాయిలను ఆగంతుకులు అపహరించిన ఘటన విశాఖ జిల్లా గాజువాక ఆంధ్రా బ్యాంక్లో చోటు చేసుకుంది. నగదు బ్యాగు పక్కన పెట్టుకుని ఫారం నింపుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు పక్కా ప్రణాళికతో నగదు కాజేశారు. ఒకరు 10 రూపాయల నోట్లు అతనికి కొంచెం దూరంలో వేసి దగ్గరికి వెళ్లాడు. ''మీ నగదు కింద పడిపోయింది చూసుకోండి'' అని చెప్పి వెళ్లిపోయాడు. పది రూపాయల నోట్లను తీసుకునేందుకు ఏడుకొండలు కిందకు చూడగా.. అంతలోనే మిగిలిన ఇద్దరు డబ్బు సంచితో ఉడాయించారు. పది రూపాయల నోట్లు తీసుకుని లేచి చూడగా.. తన డబ్బు సంచి మాయమైనట్టు బాధితుడు గుర్తించాడు. గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలో దృశ్యాల ఆధారంగా... దొంగల కోసం గాలిస్తున్నారు.
10 రూపాయలు ఆశ చూపారు.. 55 వేలు కొట్టేశారు - money
బ్యాంక్లో నగదు డిపాజిట్ చేయడానికి ఫారం నింపుతున్న వ్యక్తి దగ్గరకొచ్చారు. 10 రూపాయల నోట్లు కింద పడేశారు. మీవేనేమో చూసుకోండి అని ఆశ చూపారు క్షణాల్లో మాయ చేసి 55 వేల రూపాయలతో పరారయ్యారు.

10 రూపాయలు ఆశ చూపారు.. 55 వేలు కొట్టేశారు