తెలంగాణ

telangana

ETV Bharat / city

అందుకే ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్: చంద్రబాబు

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఏపీ సీఎం జగన్‌ ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, వ్యతిరేకత ఇంకా పెరగవచ్చనే ఉద్దేశంతో ఎన్నికల యోచనలో జగన్ ఉన్నారన్నారు. మద్యపాన నిషేధం పేరిట నాసిరకం బ్రాండ్లు తెచ్చి.. మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత లేదని దుయ్యబట్టారు.

chandrababu
chandrababu

By

Published : Mar 8, 2022, 11:49 PM IST

మద్యపాన నిషేధం పేరిట నాసిరకం బ్రాండ్లు తెచ్చి.. మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నిరుపేద మహిళలకు తెలుగుదేశం ఇళ్లు ఇస్తే.. ఓటీఎస్‌ పేరుతో వారి నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే జగన్‌.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అన్నారు. వివేకా హత్య కేసులో సోదరి సునీతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

"త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్‌ ఉన్నారు. వ్యతిరేకత ఇంకా పెరగవచ్చనే ఉద్దేశంతోనే ఎన్నికల యోచన. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం. నెత్తిమీద కుంపటిని దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్.. పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్."

-చంద్రబాబు, తెదేపా అధినేత

అందుకే ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్: చంద్రబాబు

ఇదీచూడండి:రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details