తెలంగాణ

telangana

చిత్రావతీ.. ఇదేం గతి?... గూడు లేదు.. పరిహారం లేదు.. బతికేదెలా?

నాలుగు రోజులుగా.... కరెంటు లేదు.! కాళ్ల కిందకు నీళ్లొచ్చేస్తున్నాయి.! క్రమంగా పెరుగుతూ ముంచేస్తున్నాయి. ఊరు ఖాళీ చేయాలని హెచ్చరికలు..! ససేమిరా అంటే.. జేసీబీతో బలవంతంగా కూల్చివేతలు.! కూలీనాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు... తాతల నాటి కలల సౌధాలు కళ్లెదుటే కూలిపోతున్నాయి. ఎక్కడుండాలో తెలియదు. మూటాముల్లె సర్దుకుని..... ఉన్న ఫళంగా ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సంతృప్తికర పరిహారం కోసం బాధితులు పట్టుబడితే.....సాధ్యం కాదంటూ అధికారులు మెట్టు దిగడంలేదు. ఏపీలోని అనంతపురం జిల్లాలో... చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో ఉద్రిక్తత సడలడంలేదు. ఊరి గోడు ఎవరూ ఆలకించడం లేదు.

By

Published : Nov 1, 2020, 4:59 PM IST

Published : Nov 1, 2020, 4:59 PM IST

చిత్రావతీ.. ఇదేం గతి?... గూడు లేదు.. పరిహారం లేదు.. బతికేదెలా?
చిత్రావతీ.. ఇదేం గతి?... గూడు లేదు.. పరిహారం లేదు.. బతికేదెలా?

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం, కడప జిల్లాల్లో తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన.... చిత్రావతి రిజర్వాయర్ నిర్మాణం 2009లోనే పూర్తైంది. జలాశయం పరిధిలోని 4 ముంపు గ్రామాల్లో మర్రిమాకులపల్లి కూడా ఒకటి. ఇప్పుడు పూర్తి సామర్థ్యం మేరకు..... 10 టీఎంసీల నీరు నిల్వచేయాలనుకున్న అధికారులు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఓ వైపు రిజర్వాయర్‌ను నీటితో.. నింపుతున్నారు.

అది గ్రామంలోకి ఒక్కో అడుగు చొచ్చుకొస్తోంది. ఐతే.. పరిహారంపై అసంతృప్తిగా ఉన్న గ్రామస్థులు... ప్రభుత్వానికి తమ ఆవేదన వెలిబుచ్చారు. 134 మందికి నేటికీ పరిహారం అందలేదని.... ఆరోపించారు. 2006లో పునరావాస ప్యాకేజీ ప్రకటించారని, ఇప్పుడు 2020ని ప్రామాణికంగా తీసుకుని..... 18 ఏళ్లుదాటిన అందరికీ పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

పోలీసుల ప్రహారాలో కూల్చివేతలు...

ముంపు బాధితుల గోడును అధికారులు.... పట్టించుకోవడంలేదు. బలవంతంగా జేసీబీలతో ప్రతాపం చూపారు. ఓ ఇంట్లో.... భోజనం చేస్తున్న బాలుడు,అన్నం తినిపిస్తున్న వృద్ధురాలిపై బండలు పడ్డాయి. వృద్ధురాలికి చేయి విరగ్గా.... పసివాడికి తలపగిలింది. గ్రామస్థుల ఆగ్రహంతో అక్కడి నుంచి వెనుదిరిగిన అధికారులు..... మరుసటిరోజు 150 మంది పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

మర్రిమాకులపల్లిలో ఇంకొందరికి పరిహారం అందాల్సి ఉందని కలెక్టర్‌ అంగీకరించారు. ఐతే..ఇప్పుడు 18 ఏళ్లు దాటినవారికి పరిహారం ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గ్రామస్థులకు సీపీఎం నేతలు బాసటగా నిలిచారు. అధికారులు.... దౌర్జన్యాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:తెరాస గెలిస్తేనే అభివృద్ధి: మంత్రి హరీష్​రావు

ABOUT THE AUTHOR

...view details