పదో తరగతి ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి డీఈవోలతో చిత్ర రామచంద్రన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
'పదోతరగతి జవాబు పత్రాలను జాగ్రత్తగా భద్రపరచండి'
పదో తరగతి ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. డీఈవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జవాబు పత్రాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పూర్తయిన రెండు సబ్జెక్టులకు సంబంధించిన మూడు పరీక్షల జవాబు పత్రాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాధాన పత్రాలు చెదలు పట్టకుండా, ఎలుకలు లేకుండా మందు చల్లాలని.. అగ్ని ప్రమాదాలు జరగకుండా, నీరు పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో ఉన్న మిగతా పరీక్షల ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా పునశ్చరణ పాఠాలు బోధన కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు అందరి ఇళ్లల్లో టీవీలు ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీచూడండి:తెలంగాణలో మరో 15 మందికి కరోనా... 943కి చేరిన కేసులు