విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చిరంజీవి ట్వీట్ - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
17:40 April 22
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చిరంజీవి ట్వీట్
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ప్రశ్నించారు. కరోనా కల్లోలం వేళ విశాఖ ఉక్కు రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ అందిస్తోందని గుర్తు చేసిన ఆయన.. ప్రైవేటీకరణ యత్నం ఎంత వరకు సబబని ట్వీటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తూ..విశాఖ ఉక్కు లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందన్నారు.
ఇదీ చూడండి :జీహెచ్‌ఎంసీ పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు