నాటా పోటీల్లో తెలుగు తేజం మెరిసింది. ప్రకాశం జిల్లా చీరాల యువకుడు పోటీల్లో సత్తా చాటాడు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా)2020 ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో చీరాల కుర్రోడు.. సిద్దా గురునాద్ ప్రతిభ చాటాడు. చికాగో కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నాటా కార్యవర్గం , సాహిత్యకమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.
కథలు, కవిత్వం, కార్టూన్ విభాగాల్లో నిర్వహించగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు పాల్గొనగా... ఒక్కో విభాగంలో అయిదుగురిని విజేతలుగా ఎంపిక చేశారు. కరోనా నేపథ్యంలో మాస్క్ ధారణపై వేసిన కార్టూన్‌కు గాను సిద్ద గురునాధ్కు బహుమతి లభించింది.. ఈసందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు. నాటా అధ్యక్షుడు గోశాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి పోటీలను పర్యవేక్షించారు.