ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. పెదవేగి మండలం బి. సింగవరంలో నిన్న రాత్రి చింతమనేని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి చింతమనేని వెళ్లిపోయాక వైకాపా, తెదేపా వర్గాలు ఘర్షణ పడ్డాయి. వైకాపా వర్గీయులపై చింతమనేని ప్రభాకర్ దాడి చేశాడని ఆ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు.. భారీ స్థాయిలో పోలీసు బలగాలు మాదెపల్లి వద్ద చింతమనేని వాహనాన్ని అడ్డుకొని అరెస్టు చేశారు.
'చింతమనేనిని కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు'
వైకాపా వర్గీయులపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశాడనే ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని.. ఎలాంటి ఘర్షణల్లో లేకపోయినా కుట్రపూరితంగానే పోలీసులు కేసు నమోదు చేశారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
'చింతమనేనిని కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు'
చింతమనేని.. ఎలాంటి ఘర్షణల్లో లేకపోయినా కుట్రపూరితంగానే పోలీసులు కేసు నమోదు చేశారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా నాయకులు చింతమనేని అరెస్ట్ చేయించారని అన్నారు. ఈ క్రమంలో ఏలూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: కుంట శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెరాస