Revanth Reddy on Chinna Jeeyar Swamy : గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన తల్లులను అవమానపరిచిన చినజీయర్‌ను యాదగిరి గుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
సమ్మక్క, సారలమ్మను చినజీయర్ అవమానించారు: రేవంత్ రెడ్డి - రేవంత్ రెడ్డి వార్తలు
Revanth Reddy on Chinna Jeeyar Swamy : సమ్మక్క-సారలమ్మపై చినజీయర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. యాదాద్రి ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తొలగించాలని సీఎంను కోరారు.
Revanth Reddy on Chinna Jeeyar Swamy
చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మహా కుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్‌తో పాటు సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి ఫొటోలను ట్విట్టర్లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి :మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి: ఈవో
Last Updated : Mar 18, 2022, 3:45 PM IST