రాముడి విగ్రహం ధ్వంసం కలకలం రేపిన వేళ... త్రిదండి చినజీయర్ స్వామి విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో పర్యటించారు. శ్రీ కోదండ రామాలయాన్ని స్వయంగా సందర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు.
రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి
ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి.. ఏపీ రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. భగవంతుడి విగ్రహాలు ధ్వంసం చేసిన చోటును పరిశీలించారు.
chinajeeyar swamy
స్థానిక అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. విలేకరులతో సహా.. బయటి వ్యక్తులెవరినీ ఆలయంలోనికి అనుమతించలేదు.
ఇదీ చదవండి:ఆ స్థానంలో కొత్త రాములోరి విగ్రహం తయారీ!