తెలంగాణ

telangana

ETV Bharat / city

Childrens Day in Gulf: గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

బాలల దినోత్సవాన్ని గల్ఫ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపు 25 దేశాల తెలుగు పిల్లలతో 12 గంటలపాటు నిర్విరామంగా పలు అంశాలమీద చర్చను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తమ సందేశాన్ని పంపించారు.

Childrens Day in Gulf
గల్ఫ్‌లో బాలల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశం

By

Published : Nov 20, 2021, 11:08 PM IST

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో ప్రపంచ వ్యాప్తముగా వున్న 65 కు పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యముతో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. 25 దేశాలలోని తెలుగు పిల్లలతో వర్చువల్ పద్ధతిలో 12 గంటలపాటు నిర్విరామంగా పూర్తిగా "బాలల చేత - బాలల కోసం" పేరిట బాలల దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దాదాపు 12 గంటలపాటు జరిగిన కార్యక్రమానికి ప్రతేక ఆకర్షణ పిల్లలే వ్యాఖ్యతలుగా వివిధ అంశాలమీద చర్చా వేదికలు, ప్రసంగాలు చేయించటం ఆకట్టుకుంది.

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం

వెంకయ్యనాయుడు సందేశం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తమ సందేశాన్ని పంపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే క్రమంలో ముందుగా మన కట్టు, బొట్టు, ఆట, పాట, పండుగలను పిల్లలకు పరిచయం చేసేందుకు బాలల దినోత్సవం లాంటి సందర్బాన్ని వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మన సంస్కృతికి మూలమైన మాతృ భాషను పిల్లలకు నేర్పించాలని మన శతక పద్యాలు, కథలు వారికి తెలియచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సంస్థలు విద్యార్థులను మనదైన విలువలతో తీర్చిదిద్దే విధంగా ముదుకు సాగాలని కోరుతూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే పిల్లలందరికి ఆయన ఆశీస్సులు అందచేశారు.

గల్ఫ్‌లో బాలల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశం

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రసంగం

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమములో 300 మందికి పైగా వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు పిల్లలు ప్రదర్శించటం కన్నుల పండువగా ఉందన్నారు. ఇలాంటి పిల్లల పండుగను నిర్వహించిన నిర్వాహకులకు మండలి బుద్ధప్రసాద్ అభినందనలు తెలియచేశారు. విదేశాల్లో ఉన్నా కాని మన సంస్కృతి సంప్రదాయాలు, భాషను మర్చిపోకుండా పూర్తిగా పిల్లలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించటం సంతోషకరమని గౌరవ అతిథిగా పాల్గొన్న శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ అన్నారు. వారి ప్రదర్శనలను తిలకించి మైమరచి పోయానన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం చాలా సంతోషమని మరో అతిథిగా విచ్చేసిన వంశీ ఇంటర్నేషనల్ అధినేత రామరాజు అన్నారు. మారిషస్ నుంచి ప్రముఖ వ్యక్తి సంజీవ నరసింహ, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్, సింగపూర్ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ , శుభోదయం ఇన్‌ఫ్రా ఛైర్మన్ లక్ష్మిప్రసాద్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొన్నారు.

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం

ఈ కార్యక్రమంలో భాగస్వాములైన 65 తెలుగు సంఘాల అధ్యక్షులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నిర్వాహకులు కుదరవల్లి సుధాకర రావు ధన్యవాదాలు తెలియచేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలను ప్రకటించారు. ఈ భారీ కార్యక్రమానికి అన్నివిధాల తనతో ఉండి ఈ విజయంలో ముఖ్యపాత్రను పోషించిన విక్రం సుఖవాసి, వెంకప్ప భాగవతుల, ప్రదీప్ కుమార్, ఎం.బి. రెడ్డి, గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్యలోని భాగస్వామి సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు.

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం

ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు, సౌదీ తెలుగు అసోషియేషన్ అధ్యక్షురాలు దీపిక రావి, తెలుగు కళా సమితి ఓమన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించెర్ల, ఆంధ్ర కళా వేదిక ఖతార్ అధ్యక్షులు సత్యనారణ మలిరెడ్డి, ఫుజైరా తెలుగు కుటుంబాల అధ్యక్షుడు వేద మూర్తి, తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమా అధ్యక్షుడు వెంకట సురేశ్ పాల్గొని పిల్లలు జీవితంలో అలవర్చుకోవలసిన వివిధ అంశాలైన ప్రసంగించి వారిని ఉత్తేజ పరిచారు.

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో బాలల దినోత్సవం

ఇదీ చూడండి:

children's day 2021: చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఆట.. మాట.. ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details