తెలంగాణ

telangana

ETV Bharat / city

'వచ్చే రెణ్నెళ్లు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి'

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ రమేశ్​ బాబు స్పష్టం చేశారు. దశలవారీగా వ్యాక్సిన్‌ ఇవ్వక తప్పదన్న ఆయన... ప్రస్తుతం చిన్నారులకు కరోనా వైరస్‌ వస్తున్నా దాని ప్రభావం అంతగా లేదన్నారు. ఎక్కువ మంది పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటం శుభపరిణామమన్నారు. వచ్చే నెలలో కరోనా తీవ్రరూపు దాల్చే ప్రమాదం ఉన్నందున పిల్లల్ని అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని రమేశ్​ బాబు సూచించారు. తల్లులకు మహమ్మారి సోకినా కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలంటున్న డాక్టర్‌ రమేశ్​ బాబుతో ఈటీవి భారత్​ ముఖాముఖి.

'వచ్చే రెణ్నెళ్లు పిల్లల ఆరోగ్యంపై శ్రద్దపెట్టాలి'
'వచ్చే రెణ్నెళ్లు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి'

By

Published : Apr 25, 2021, 4:07 AM IST

Updated : Apr 25, 2021, 8:05 AM IST

"చిన్నారుల్లో వైరస్‌ సోకుతున్నా ఆందోళన చెందాల్సినంత ప్రమాదమైతే ఏమీ లేదు. కొంత మందిలోనే ఆస్పత్రుల్లో చేరేంతటి తీవ్ర లక్షణాలు కన్పిస్తున్నాయి. ఎక్కువ మందిలో వైరస్‌ ప్రభావం నామమాత్రంగానే ఉంది. వచ్చే రెణ్నెళ్లు పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు తల్లి పాలు ఆపాల్సిన అవసరం లేదు. గర్భిణీలు అస్సలు భయపడాల్సిన పని లేదు. చాలా మందికి వైరస్‌ సోకడం లేదు. చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌లపై ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో టీకాలు అందుబాటులోకి వస్తాయి. వైరస్‌లతో పోరాడే సామర్థ్యం పిల్లల్లో ఉంటుంది. బ్యాక్టీరియా బగ్స్‌తో మాత్రమే కాస్త ఇబ్బందులుంటాయి." - చిన్నపిల్లల వైద్యులు డా. రమేశ్​ బాబు

ఇదీ చూడండి: ప్రజలు కరోనా భయాలను జయించడం ఎలా?

Last Updated : Apr 25, 2021, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details