Bridge constructed by children: ఆంధ్రప్రదేశ్ కడపలోని బుగ్గవంకపై ఉన్న కాజ్‌వే.. రెండు నెలల క్రితం వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. ఉన్న ఒక్క కాజ్ వే కొట్టుకుపోవడంతో.. పాఠశాలకు వెళ్లే పిల్ల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చుట్టూ తిరిగి చాలా దూరం నడిచి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
Bridge constructed by children: నడుం బిగించిన చిన్నారులు.. బడి, భవిష్యత్‌కు 'బాట'..! - buggavanka causeway
Bridge constructed by children: వరదల్లో బ్రిడ్జీ కొట్టుకుపోయింది.. ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోలేదు.. ఫలితంగా బడికిపోవడానికి బాట బందైయింది. చేసేదిలేక చిన్నారులే నడుం బిగించారు. డబ్బులు సేకరించి.. వారి బడికి, భవిష్యత్‌కూ బాట వేసుకున్నారు!
నడుం బిగించిన చిన్నారులు.. బడి, భవిష్యత్‌కు "బాట"..!
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో.. చిన్నారులే తమ సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. తామే వంతెన నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. చిన్నారులంతా కలిసి చందాలు వసూలు చేసి, మరికొందరి సహకారంతో కాలిబాట నిర్మించుకున్నారు. సుమారు రూ.3వేలు వెచ్చించి కర్రలు కొనుగోలు చేసి కాజ్‌వే పై తాత్కాలికంగా కాలిబాటను ఏర్పాటు చేసుకున్నారు.
ఇదీ చదవండి:'హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలం'