Child line staff Irregularities: బాల్య వివాహాలను అరికట్టాలని మొత్తం మానవ సమాజమే చెప్పుతుంటే ఆ బాల్య వివాహం విషయమై చైల్డ్‌లైన్ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు బాల్య వివాహం జరిగినట్లు స్థానిక వాలంటీర్లు చైల్డ్ లైన్ 1098కి సమాచారం ఇచ్చారు.
వారు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఉన్న చైల్డ్ లైన్ సిబ్బందికి తెలియజేశారు. వీరు బాల్య వివాహం చేసుకున్న యువకుడి తల్లిదండ్రులను ఏలూరుకు పిలిపించి బేరసారాలకు సాగించారు. ఈ నేపథ్యంలో బాధితులు మీడియాను ఆశ్రయించారు. వారంలోగా అమ్మాయి పేరున లక్ష రూపాయలు చెల్లించకపోతే యువకుడు జైలుకు వెళ్తాడని చైల్డ్ లైన్ సిబ్బంది బెదిరించారు.