తెలంగాణ

telangana

ETV Bharat / city

Child Adoption in Telangana : కంటిపాపల్లా పెంచుకుంటాం.. కన్నప్రేమను పంచుతాం!

Child Adoption in Telangana : 'కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కనిపెంచే ప్రతి దేవతే అమ్మే కదా.. కన్నఅమ్మే కదా' అని ఓ రచయిత అన్నట్లు కడుపులో మోసి కంటేనే అమ్మ కాదు.. మాతృత్వంతో తన కడుపున పుట్టకపోయినా ప్రేమను పంచే ప్రతి మహిళ అమ్మే అని. ఇలా తమకు పిల్లలు పుట్టరని తెలిసిన చాలా మంది దత్తత వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల కన్నవారిని కోల్పోయిన బిడ్డలకు అమ్మానాన్నలమవుతామని చాలా మంది పోటీపడుతున్నారు. కనకపోయినా వారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటామంటున్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల వ్యవధిలో పిల్లల దత్తతకు ఆదరణ పెరుగుతున్నట్టు మహిళా శిశుసంక్షేమ అధికారులు చెబుతున్నారు.

Child Adoption in Telangana
Child Adoption in Telangana

By

Published : Dec 23, 2021, 8:16 AM IST

Updated : Dec 23, 2021, 11:52 AM IST

  • గచ్చిబౌలికి చెందిన యువతీ, యువకులు ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని ఆశపడుతున్నారు. నిబంధనల ప్రకారం పెళ్లయిన రెండేళ్ల తరువాతే దత్తత దరఖాస్తుకు అవకాశం ఉండటంతో మరో ఏడాదీ ఎదురుచూస్తామంటున్నారు.

Child Adoption in Telangana : వీళ్లే కాదు ఇలా పిల్లల దత్తత కోసం ముందుకొస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. నెల తిరిగేసరికి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం తర్వాత ఈ ధోరణి బాగా ఎక్కువైంది. ‘‘ప్రధానంగా కొవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన బిడ్డలకు అమ్మానాన్నలమవుతామంటూ చాలామంది పోటీపడుతున్నారు. వాళ్లు అనాథలుగా ఉండిపోకూడదనే ఆందోళనతో వెంటనే దత్తతకు ఇవ్వమంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారని’’ మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.

Child Adoption Increased in Telangana : రాష్ట్రంలో ఐదేళ్ల వ్యవధిలో పిల్లల దత్తతకు ఆదరణ పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే దత్తత కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య ప్రస్తుతం 8000-9000 వరకు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాల్లో పిల్లలను కోల్పోయిన ఆలుమగలు, సంతానలేమి సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి అలసిపోయిన యువ దంపతులు ప్రేమ పంచేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో విదేశీయుల ఆలోచన మరింత భిన్నంగా ఉంటున్నట్టు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు. ‘‘స్వదేశీయులు ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎక్కువ మంది ఆడపిల్లలే కావాలని కోరుతున్నారు. విదేశీయులు ప్రత్యేక అవసరాలున్న(దివ్యాంగులు) చిన్నారులను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా స్వీకరించిన బిడ్డలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మిగిలిన వారితో పోటీపడేలా తయారుచేయాలనే ఆలోచన వారికున్నట్టు మా పరిశీలనలో తేలిందని’ అధికారులు చెబుతున్నారు.

ఎందుకు ఎక్కువైందంటే

Baby Adoption In telangana : కొవిడ్‌ కారణంగా పిల్లలు అనాథలుగా మారారని సామాజిక, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇది పలువురి మనసులను కలచివేస్తోంది. ‘‘తల్లి పొత్తిళ్లలో పెరిగి..ఉన్నట్టుండి వారిని కోల్పోయే శిశువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటున్న పలువురు తమ ఇంట్లో అలాంటి ఘటన జరిగినట్టే భావిస్తున్నారు. వారిని ఎలాగైనా ఒడికి చేర్చుకోవాలని తపనపడుతున్నారు. దరఖాస్తుల ప్రక్రియలో ఈ వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని’ అధికారులు చెబుతున్నారు.

దరఖాస్తుకు ప్రత్యేక వ్యవస్థ

Baby Adoption Guidelines : పిల్లల్లేని దంపతులు అధికారికంగా దత్తత తీసుకునేందుకు కేంద్రీయ దత్తత ఏజెన్సీ(కారా)కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య తదితర పరిస్థితులు పరిశీలించాక అధికారులు అనుమతులు ఇస్తారు. వివరాలకు. cara.nic.in ను సంప్రదించవచ్చు.

ఇబ్బంది పెడితే వెనక్కే..

Child Adoption Rules : పిల్లలను దత్తత తీసుకున్న వారిపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రత్యేక సంస్థ (స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీ, ఎస్‌ఏఏ) రెండేళ్లపాటు పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రతి ఆర్నెల్లకోసారి శిశువుల పెరుగుదల తదితర అంశాలపై నివేదిక తయారుచేస్తుంది. సంరక్షణ సమయంలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తిస్తే జిల్లా శిశు సంరక్షణ ప్రతినిధుల(చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌)కు సమాచారం అందిస్తుంది. వారు క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపి ఆ బిడ్డలను వెనక్కి తీసుకుంటారు.

ఈ నిబంధనలు పాటించాల్సిందే..

  • దత్తత తీసుకునే వారు శారీరక, మానసిక ఆరోగ్యం, ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండాలి.
  • ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఉండకూడదు.
  • భార్యాభర్తలిద్దరి సమ్మతి అవసరం.
  • ఒంటరి మహిళ ఆడ/మగబిడ్డను తీసుకోవచ్చు.
  • ఒంటరి పురుషులు ఆడ శిశువును స్వీకరించేందుకు అనర్హులు.
  • ముగ్గురు, అంతకు మించి పిల్లలున్న దంపతులు అనర్హులు.
  • విదేశీయులు ముందస్తుగా తమ దేశంలోని సంబంధిత అధీకృత విదేశీ దత్తత సంస్థ (ఆథరైజ్డ్‌ ఫారిన్‌ అడాప్షన్‌ ఏజెన్సీ)ను సంప్రదించాలి.

వ్యవధి పెంపు

ఈ ప్రక్రియలో ప్రభుత్వం మార్పులు చేసింది. దత్తత కోసం రిజర్వ్‌ చేసే (కోరుకున్న శిశువును ఇచ్చే) వ్యవధిని పొడిగించింది. ఆన్‌లైన్‌లో రిజర్వ్‌ చేయడానికి 48-96 గంటలు, ఎంపికకు 20-30 రోజుల సమయం ఇచ్చింది.

Last Updated : Dec 23, 2021, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details