forest department: అటవీ రక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే... రాష్ట్రమంతా మరింత పచ్చదనం పెంపొందించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియల్ అన్నారు. రానున్న ఏడాదికాలంలో అటవీశాఖ తరపున చేపట్టాల్సిన పనులు, రోడ్‌మ్యాప్‌పై అన్ని సర్కిళ్లకు చెందిన అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించిన డోబ్రియల్... హరితహారం ద్వారా చేపట్టిన పనులు, ఫలితాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోందన్నారు. ఆ ఉత్సాహంతో వచ్చే ఏడాది లక్ష్యాల మేరకు, ఫలితాలు చూపించే దిశగా పనిచేయాలని చెప్పారు.
అటవీశాఖలో ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్సీకి సహకారం అందిస్తాం: డోబ్రియల్ - అటవీ శాఖలో పోస్టుల భర్తీ
forest department: అటవీ రక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే... క్షీణించిన చోట పెద్ద ఎత్తున పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియల్ తెలిపారు. రాష్ట్రమంతా మరింత పచ్చదనం పెంపొందించాలని అన్నారు. ప్రభుత్వం అనుమతి మేరకు అటవీ శాఖలో పోస్టుల భర్తీ వేగవంతమయ్యేలా టీఎస్‌పీఎస్సీకి సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు.
వచ్చే నెలలో మొదలయ్యే పల్లె, పట్టణ ప్రగతితో పాటు, రానున్న హరితహారం కోసం ముందస్తుఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అగ్ని ప్రమాదాల నివారణలో క్షేత్రస్థాయి సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్‌లను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా కృషి చేయాలని... పీసీసీఎఫ్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అనుమతి మేరకు అటవీ శాఖలో పోస్టుల భర్తీ వేగవంతమయ్యేలా టీఎస్‌పీఎస్సీకి సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇదీ చదవండి:ఇక నుంచి మెట్రో రైడ్ ఆటోలు.. త్వరలోనే శంషాబాద్ నుంచి ఫేజ్ 2.!