ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (cm jagan) ఈనెల 7న దిల్లీ (delhi tour) వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amith sha)తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ (corona vaccine) సరఫరాతో పాటు వేర్వేరు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశాలున్నాయి.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు(polavaram project) నిధులు, విభజన హామీలకు సంబంధించిన అంశాల్లో నిధుల విడుదలపై కూడా జగన్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్టు సమాచారం. ప్రధానమంత్రితో భేటీకి సీఎం కార్యాలయం (AP CMO) సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇవి ఖరారైతే ముఖ్యమంత్రి జగన్ (cm jagan) సోమవారం దిల్లీకి బయల్దేరనున్నారు.