ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం తుదిదశకు చేరింది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను అధికారుల కమిటీ ముఖ్యమంత్రికి అందజేయనుంది. పీఆర్సీ, అధికారుల కమిటీ నివేదికల ఆధారంగా వేతన సవరణపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికపై సీఎస్ సోమేశ్ కుమార్ సారథ్యంలోని అధికారుల కమిటీ ఉద్యోగసంఘాలతో చర్చలు జరిపింది. మొత్తం 13 సంఘాల నుంచి అభిప్రాయాలు, వినతులు తీసుకుంది. మరికొన్ని ఇతర సంఘాలు కూడా తమ అభిప్రాయాలను అధికారులకు అందించాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించే పనిలో అధికారులు పడ్డారు. పీఆర్సీ నివేదికలోని ముఖ్యంశాలు, వాటిపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పేర్కొంటూ నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో పీఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం ఏ కేటగిరీల వారికి ఎంత మేర అదనపు ఆర్థిక లబ్ధి కలగనుందన్న విషయమై కూడా అధికారులు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే సీఎం నిర్ణయం :