భూముల సమగ్ర సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రంలోని భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో భూ సర్వే కోసం రూ.400 కోట్ల కేటాయించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది.
భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - తెలంగాణ తాజా వార్తలు
11:01 June 02
భూముల సమగ్రసర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ఈ నేపథ్యంలో భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఆర్థిక, రెవెన్యూ, సర్వే, టీఎస్టీఎస్ అధికారులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. భూముల డిజిటల్ సర్వే చేసేందుకు ఆసక్తి కనబర్చిన వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులూ సమావేశానికి హాజరయ్యారు.
ఆయా కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. మంగళవారమే.. ప్రాథమికంగా సమావేశమై సర్వే సంబంధిత అంశాలపై చర్చించారు.
ఇవీచూడండి:Dharani : భూసమస్యల పరిష్కారానికి 5 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్