'సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలి' - Chief Minister KCR Review on Horticulture
17:14 October 14
ఉద్యానవన శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
కూరగాయలు, పండ్లు, పూల తోట్ల సాగులో ఏడాదిలోపు విప్లవాత్మక మార్పులు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల సాగులో రాష్ట్రం అగ్రస్థానం సంపాదించాలన్న కేసీఆర్.... రాష్ట్ర సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన శాఖ బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని... పంటల విషయంలో సమగ్ర దృక్పథం ఏర్పరచుకోవాలన్నారు.
రాష్ట్రానికి ఎన్నో సానుకూలతలు ఉన్నప్పటికీ దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని... మన అవసరాలు తీర్చేలా ఉద్యానవన పంటలు సాగు ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని సాగు పద్ధతులపై అధ్యయనం చేయాలని... బెంగళూరులోని హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో అధికారులకు శిక్షణ ఇప్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కొంగరకలాన్‌లో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి: 'ముంపు బాధితుల కోసం సెంటర్హోం ఏర్పాటు చేస్తాం'