CM kcr Phone to Chiranjeevi:అగ్ర కథానాయకుడు చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఇటీవల చిరంజీవికి కరోనా సోకడంతో కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
తనకు కరోనా సోకినట్లు చిరంజీవి బుధవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.