దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాలమూరుకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. తెలుగురాష్ట్రాల కృష్ణాజలాల వివాదంపై చర్చించారు.
KCR meets Shekhawat: ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ పరిధిలోకి తేవాలి : కేసీఆర్ - కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ
14:13 September 25
కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ
పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు, నీటి కేటాయింపులు చేయాలని షెకావత్‌ను సీఎం కేసీఆర్ కోరారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ అమలు తేదీ వాయిదా వేయాలని ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు ప్రజాప్రతినిధులతో కలిసి షెకావత్‌ను కలిశారు.
శాంతిభద్రల దృష్ట్యా...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానుండగా.. ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే లేఖలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.
ఇదీ చదవండి :రేవంత్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌కి కారణమేంటి?