CJ Planted Trees on World Forest Day: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మొక్కలు నాటారు. అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి... సర్కార్ అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు చాలా బాగున్నాయని కొనియాడారు.
మొక్కలు నాటడమే ఉత్తమ మార్గం..
World Forest Day: రాష్ట్రం హరితహారం ద్వారా 'జంగిల్ బచావో- జంగిల్ పడావో' నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను అటవీ సంరక్షణాధికారి డోబ్రియాల్ సీజేకు వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్ ప్రధాన న్యాయమూర్తితో కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటడం మంచి అలవాటని... ప్రతిఒక్కరూ దీన్ని అలవరుచుకోవాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే ఉత్తమ మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Bharatmala Land Survey: 'నాగ్‌పుర్-విజయవాడ రహదారికి మా భూములు ఇచ్చేదేలే'