హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ తేదీ(huzurabad election campaign last date) సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఎవరూ ప్రలోభపెట్టకుండా చూడాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఈఓ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
కఠినంగా అమలు చేయాలి..
ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని సీఈఓ ఆదేశించారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 20 కంపెనీల కేంద్ర బలగాలను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ మోహరించాలన్న సీఈఓ... ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.