Chicken Price Hike : కోడి మాంసం ధర బాగా పెరుగుతోంది. 30 రోజుల క్రితం కిలో రూ.175 ఉండగా.. తాజాగా రూ.300కి విక్రయిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా. రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారని అంచనా. ఆదివారం నాడు 15 లక్షల కిలోలకు పైగా ఉంటోంది. కరోనా భయం తగ్గడంతో గత పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయి.
Chicken Price Hike: మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన చికెన్‌ధర - CHICKEN PRICE IS HIKED IN TELANGANA
Chicken Price Hike : కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మాంసాహారానికి డిమాండ్ బాగా పెరిగింది. అప్పట్నుంచి మాంసం ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చికెన్ ధర బాగా పెరుగుతోంది. 30 రోజుల క్రితం కిలో రూ.175 ఉండగా ఇప్పుడు రూ.300కి విక్రయిస్తున్నారు.
Chicken Price Hike
ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పులకు సర్దుబాటు కాలేక కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా ధరలూ పెరిగాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం రూ.4 వేల నుంచి 5 వేలు ఉండగా.. ప్రస్తుతం 7,200 రూపాయలు ఉంది. ఈ కారణాలతో మాంసం ధర పెరిగింది.
ఇదీ చూడండి:కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళన చెందా: గవర్నర్ తమిళిసై