తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆనందయ్య ఔషధంపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలకు నిర్ణయం - Chevireddy meet Anandayya disciples

ఆనందయ్య ఔషధంపై పరిశోధన జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే తితిదే ఆధ్వర్యంలో ఔషధం తయారుచేస్తామని తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.

chevireddy-bhaskarreddy-met-with-anandayya-disciples
ఆనందయ్య శిష్య బృందంతో చెవిరెడ్డి భేటీ.. ఔషధ తయారీపై చర్చ

By

Published : May 26, 2021, 1:26 PM IST

Updated : May 26, 2021, 1:43 PM IST

ఆనందయ్య శిష్యబృందంతో తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భేటీ అయ్యారు. తిరుపతి తుడా కార్యాలయంలో ఆయన నిర్వహించిన సమావేశంలో ఆనందయ్య మనవడు వంశీకృష్ణ, మేనల్లుడు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

ఆనందయ్య ఔషధంపై పరిశోధన జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే తితిదే ఆధ్వర్యంలో ఔషధం తయారుచేస్తామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోనే ఔషధ పరిశోధనకు ల్యాబ్ ఉందని. . ఆనందయ్య తయారు చేసిన మందును అక్కిడికే పంపుతున్నామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందనుకుంటున్నామని.. ఆనందయ్య ఔషధానికి ఆమోదం లభిస్తే లక్షల మందికి అందిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'

Last Updated : May 26, 2021, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details