శ్రీనువైట్ల ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన చేవెళ్ల ఎంపీ - గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన రంజిత్ రెడ్డి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా... చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, పలువురు ఎంపీలకు ఛాలెంజ్ విసిరారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి... తన నివాసంలో మొక్కలు నాటారు. అడవులు హరించిపోతున్న తరుణంలో సీఎం కేసీఆర్... హరితయజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటిస్తున్నారని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. సినీ డైరెక్టర్ శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రంజిత్ రెడ్డి... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సహచర ఎంపీలు తేజస్వీ సూర్య, అసదుద్దీన్ ఓవైసీ, మిమి చక్రవర్తి, శశిథరూర్, గల్లా జయదేవ్, గౌతమ్ గంబీర్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.