23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాలు - hyderabad news
16:20 December 20
తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై జరగనున్న చర్చ
Chennai drinking water committee meeting: కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఈ నెల 23 న చైన్నై తాగునీటి కమిటీ భేటీ కానుంది. తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై సమావేశంలో చర్చ జరగనుంది. భేటీలో ఐదు రాష్ట్రాల అధికారులు, కేఆర్ఎంబీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు హాజరు కానుండగా.. చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కాగా వర్చువల్ విధానంలో ఈ కమిటీ సమావేశం కావడం ఇది ఆరోసారి.