కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు కూకట్పల్లి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వై జంక్షన్లో సోడియం హైపోక్లోరైడ్ను చల్లారు. మొత్తం మూడు ఫైర్ స్టేషన్ల పరిధిలోని వాహనాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, కూరగాయల మార్కెట్లు, ఫుట్పాత్లు, దుకాణాల ముందు స్ప్రే చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఏసీపీ సురేందర్రావులు పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ
కరోనా నివారణ చర్యల్లో జీహెచ్ఎంసీ మరింత అప్రమత్తమైంది. హైదరాబాద్లోని ప్రధాన వీధుల్లో జెట్టింగ్ మిషన్లతో రసాయనాలు చల్లారు. కూకట్పల్లిలో ఫుట్పాత్లు, దుకాణాల ముందు స్ప్రే చేశారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ
TAGGED:
chemical spray