ఏపీ విశాఖ జిల్లా పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలోని అనన్య అమ్మోనియా కంపెనీలో ప్రమాదం జరిగింది. ట్యాంకర్లకు గ్యాస్ నింపుతున్న సమయంలో పైప్ లైన్ లీకైంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై లీకేజీని అదుపులోకి తీసుకువచ్చారు.
విశాఖ జిల్లాలో మరో గ్యాస్ పైప్ లైన్ లీక్
ఏపీ విశాఖ జిల్లా పరవాడ మండలంలోని అనన్య అమ్మోనియా కంపెనీలో ప్రమాదం జరిగింది. సంస్థను తక్షణం మూసివేయాలని స్థానికులు ధర్నా చేపట్టారు.
gas
రాత్రి సమయం కావటంతో ఏం జరుగుతుందోనన్న భయంతో బయటకు వచ్చిన గ్రామస్థులు... కళ్లు, ఒళ్లు మంటలు వస్తున్నయంటూ కంపెనీ ముందు ధర్నా చేపట్టారు. సంస్థను మూసివేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవటంతో పోలీసులతో సంప్రదింపులు జరిపి గ్రామస్థులు వెనుదిరిగారు.