గచ్చిబౌలిలో చిరుత సంచారంపై అధికారుల వివరణ - హైదరాబాద్ తాజా వార్తలు
![గచ్చిబౌలిలో చిరుత సంచారంపై అధికారుల వివరణ Cheetah wandering in Gachibowli IT corridor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9860146-1041-9860146-1607823670406.jpg)
06:42 December 13
గచ్చిబౌలిలో చిరుత సంచారంపై అధికారుల వివరణ
గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచారం వార్తలపై అటవీశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రోడా మిస్త్రీ కళాశాల సమీపంలో చిరుత కనిపించిందని స్థానికులు ఫిర్యాదుచేశారు.
ఈ మేరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు నిఘా పెట్టారు. చిరుత జాడ కనిపించలేదని.. ట్రాప్ కెమెరా దృశ్యాల్లో కుక్కలు, కోతులు మాత్రమే కనిపించాయని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు నిఘా కొనసాగిస్తామన్నారు.
ఇవీచూడండి:చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు