ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..! - రాశిఫలాలు వార్తలు
ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..?
ఈ రోజు రాశిఫలాలు
By
Published : Apr 28, 2021, 4:23 AM IST
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టదేవత ధ్యానం చేయాలి.
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
గౌరవ సన్మానాలు అందుకుంటారు. వ్యవసాయ, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీస్తుతి శుభదాయకం.
ప్రయత్నసిద్ధి ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే శుభప్రదం.
చిత్తశుద్ధితో చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో కాలం వృథా చేసుకోవద్దు. విష్ణు సహస్రనామ పారాయణ శుభాన్నిస్తుంది.
మనోధైర్యంతో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. చెడు ఆలోచనలను దరిచేరనీయవద్దు. దత్తాత్రేయ స్వామిని దర్శనం శ్రేయోదాయకం.
మిశ్రమకాలం. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. దైవారాధన మానవద్దు.
శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. సూర్య నమస్కారాలు చేస్తే మంచిది.
మనస్సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. చెడ్డవాళ్లు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి నామస్మరణ శుభప్రదం.
చేపట్టే పనుల్లో గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు. సకాలంలో తగిన సాయం చేసేవారున్నారు. శివారాధన చేస్తే మంచిది.