తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - నేటి రాశిఫలాలు

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

today horoscope
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

By

Published : Apr 27, 2021, 6:20 AM IST

యశోవృద్ధి ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శరీర బలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీవిష్ణు ఆరాధన చేస్తే శుభదాయకం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అర్థలాభం ఉంది. కీలక విషయాల్లో సొంతనిర్ణయాలు లాభాన్నిస్తాయి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా చదవితే మంచిది.

చేపట్టిన పనులు పూర్తవుతాయి. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా పెద్దగా ఇబ్బందిపెట్టవు. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఆరోగ్యమే మహా భాగ్యం అని మరువకండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవారాధన ఉత్తమం.

శుభ సమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దైవారాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు.

మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. విష్ణు సహస్రనామాలు చదివితే శుభం జరుగుతుంది.

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడంతో సంతోషంగా ఉంటారు. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించండి. దుర్గాస్తుతి పఠించాలి.

గొప్ప ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

మనస్సౌఖ్యం ఉంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

మంచి కాలం. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన మరింత మేలు చేస్తుంది.

పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించాలి.

సుఖ సౌఖ్యాలున్నాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.

ABOUT THE AUTHOR

...view details