ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శాంపూర్ గ్రామానికి చెందిన కునమల్ల శ్రీనివాస రావు అనే వ్యక్తి వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నానని చెబుతూ.. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి ఫోన్లు చేసేవాడు. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు ఫోన్ చేసి ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తానని.. దానికి కొంత ఖర్చవుతుందని డబ్బు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని కొందరు మంత్రి దృష్టికి తీసుకురావడం వల్ల.. స్పందించిన మంత్రి ఈటల.. సదరు వ్యక్తిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
'హలో! మంత్రి ఈటల కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ..' - ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో పనిచేస్తున్నానని చెబుతూ అమాయకుల వద్ద నుంచి డబ్బు కాజేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఈటల ఆదేశాల మేరకు అతణ్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
మంత్రి ఈటల పేరుతో మోసం
మంత్రి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ మీద గతంలోనూ ఐదు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. ఇటువంటి వారిని నమ్మి మోసపోకూడదని సూచించారు. ఎవరైనా ఇలా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.