రాజకీయ నాయకుడినంటూ కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి అరెస్ట్ - cheater arrest in hyderabad
14:04 January 24
రాజకీయ నాయకుడినంటూ కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఘరానా మోసగాడు అరెస్ట్ అయ్యాడు. రాజకీయ నాయకుడినంటూ మాడల పురుషోత్తం రూ.కోట్లు కొల్లగొట్టాడు. ప్రభుత్వ స్థలాలు విక్రయిస్తూ అక్రమంగా రూ.కోట్లు దండుకున్నాడు. ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి పెట్రోల్ బాటిల్‌లో దాడికి యత్నించాడు.
రాజకీయ నేతలు, రెవెన్యూ, పోలీసు అధికారులను గతంలో బెదిరించినట్లు వెల్లడైంది. రంగారెడ్డి కలెక్టర్ ఫిర్యాదు మేరకు పురుషోత్తంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వనపర్తి జిల్లా ఖిలాఘన్‌పూర్ మండలం వెంకటంపల్లి వాసి.